Sun Mar 30 2025 11:34:03 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నితిన్ తో నడ్డా భేటీ
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ ను కలవనున్నారు. నోవోటెల్ హోటల్ ఈరోజు నితిన్ తో భేటీ కానున్నారు

హీరోలను భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వం దగ్గరకు తీస్తుంది. వారిని తమ పార్టీ మద్దతుదారులుగా చేర్చుకుంటుంది. వారి అభిమానులు తమ పార్టీకి అనుకూలంగా మారతారన్న కారణం కావచ్చు. దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఇదే పద్ధతిని బీజేపీ కేంద్ర నాయకత్వం అనుసరిస్తుంటుంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశమయ్యారు. ఆయనతో డిన్నర్ చేశారు. ఎంపిక చేసుకున్న హీరోలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ భేటీలు కొనసాగుతున్నాయి.
మిథాలీ రాజ్ తో కూడా...
మరో వైపు యువతను ఆకట్టుకోవడం కూడా సులువుగా ఉంటుందన్నది బీజేపీ నేతల అంచనా కావచ్చు. తాజాగా తెలంగాణకు నేడు వస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ ను కలవనున్నారు. నోవోటెల్ హోటల్ ఈరోజు సాయంత్రం హీరో నితిన్ తో భేటీ కానున్నారు. ఆయన మధ్యాహ్నం హైదరాబాద్ కు రాగానే పార్టీ నేతలతో ముఖ్య సమావేశం ఉంటుంది. అనంతరం మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ తో భేటీ కానున్నారు. మరికొందరితోనూ జేపీ నడ్డా సమావేశమవుతారని తెలిసింది. వీరితో రాజకీయ అంశాలు చర్చిస్తారా? లేద మర్యాదపూర్వకంగా కలసి వారి వారి రంగాల్లో విశేషాలను అడిగి తెలుసుకుంటారో తెలియదు కాని బీజేపీ అగ్రనేతల భేటీలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
Next Story