Mon Dec 23 2024 05:50:14 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేటి నుంచి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను నిర్వహిస్తుంది.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేటి నుంచి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లను నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఈ సమావేశాలను ఏర్పాటు చేస్ుతుంది. ఈరోజు ప్రారంభమయ్యే సమావేశాలు ఈ నెల 25వరకూ అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతాయి. ఇందులో భాగంగా ఉదయం పది గంటలకు కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లి చౌరస్తాలో జరిగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొననున్నారు.
ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను...
సికింద్రాబాద్ జరిగే సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో జరిగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి డీకే అరుణ, సనత్ నగర్ లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ లు పాల్గొంటారు. బల్కంపేట అమ్మవారి ఆలయం వెనక వైపు నిర్వహించే సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజలకు చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ సమావేశాలను ఏర్పాటు చేశారు.
Next Story