Mon Dec 23 2024 00:10:13 GMT+0000 (Coordinated Universal Time)
BJP : నేటి నుంచి బీజేపీ విజయ్ సంకల్ప యాత్రలు
భారతీయ జనతా పార్టీ నేటి నుంచి తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలను చేపట్టనుంది
BJP Update:భారతీయ జనతా పార్టీ నేటి నుంచి తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలను చేపట్టనుంది. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ యాత్రలు జరుగుతాయి. మొత్తం యాత్రలను ఐదు కస్టర్లుగా విభజించారు. ఈరోజు నాలుగు కస్టర్లను వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ప్రారంభిస్తారు.
నేడు నాలుగు కస్టర్ల నుంచి...
బాసర నుంచి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాసశర్మ , తాండురు నుంచి కేంద్ర మంత్రి బీఎల్ వర్మ, యాదాద్రి యాత్రను గోవా ముఖ్యమంత్రి పరమాదో సావంత్, మక్తల్ లో యాత్రను మరో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలాలు ప్రారంభించనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రలు వచ్చే నెల రెండో తేదీ వరకూ జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ ఈ యాత్రలను చేపట్టింది.
Next Story