Mon Dec 23 2024 15:23:48 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ
సచివాలయంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజను నిర్వహించనున్నారు
తెలంగాణ సచివాలయంలో నేడు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజను నిర్వహించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిసెంబరు 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించాలని నిర్ణయించారు.
నూతన సచివాలయంలో...
నూతన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దాని ఏర్పాటుకు ముందుకు వచ్చింది. డిసెంబరు 9న జాతీయ నేతలను కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రానున్నారు. ఈరోజు భూమి పూజలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పాల్గొననున్నారు.
Next Story