Fri Dec 20 2024 05:05:43 GMT+0000 (Coordinated Universal Time)
Telangana High Court Bhoomi pooja: నేడు నూతన హైకోర్టు నిర్మాణానికి భూమి పూజ
తెలంగాణలో నూతనంగా నిర్మించనున్న హైకోర్టుకు నేడు భూమి పూజ జరగనుంది
Telangana High Court Bhoomi pooja:తెలంగాణలో నూతనంగా నిర్మించనున్న హైకోర్టుకు నేడు భూమి పూజ జరగనుంది. రాజేంద్ర నగర్ లో కొత్తగా హైకోర్టు భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు పాల్గొననున్నారు. ఈ భవనాలను పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ ఆంక్షలు...
అయితే హైకోర్టుకు భూమి పూజ జరిగే కార్యక్రమంలో చీఫ్ జస్టిస్, రాష్ట్ర మంత్రులు వస్తుండటంతో ఆ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పలు చోట్ల ట్రాఫిక్ ను దారి మళ్లిస్తున్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు వెళ్లేలా చూసుకోవాలని పోలీసులు ముందుగానే తెలిపారు.
Next Story