Mon Apr 21 2025 07:07:55 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు భూభారతి పోర్టల్ ప్రారంభం
తెలంగాణలో నేటి నుంచి భూ భూభారతి పోర్టల్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పోర్టల్ ను ప్రారంభించనున్నారు

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి భూ భూభారతి పోర్టల్ ప్రారంభం కానుంంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి ఈ పోర్టల్ ను ప్రారంభించనున్నారు. తెలంగాణలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి, ప్రలకు మరింత సులువుగా, వేగంగా అందుబాటులో ఉండేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి పోర్టల్ ను తీసుకు వచ్చింది.
మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా...
తొలుత మూడు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వాటిని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. భూ భారతి పై అవగాహన సదస్సులను కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రజలు తమ భూములు, స్థిరాస్థులకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేయడానికి అధికారులు సిద్ధంగా ఉంటారు. ప్రజల నుంచి కూడా సూచనలను, సలహాలను స్వీకరిస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని అమలు చేయనున్నారు.
Next Story