Mon Dec 23 2024 08:22:43 GMT+0000 (Coordinated Universal Time)
బండికి కోమటి రెడ్డి కౌంటర్
తాను బీజేపీలో ఎవరితోనూ టచ్ లో లేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
తాను బీజేపీలో ఎవరితోనూ టచ్ లో లేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను అభివృద్ధి గురించి మాత్రమే గత కొద్ది రోజులుగా పనిచేస్తున్నానని, ప్రధాని మోదీని కలిశానని చెప్పారు. ప్రధాని మోదీని కలిసింది కూడా జాతీయ రహదారుల గురించి మాత్రమే కలిశానని తెలిపారు. బండి సంజయ్ ను ఎప్పుడూ తాను కలవలేదని, మాట్లాడలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
రాజీనామా ఆమోదం పొందాక....
రాజగోపాల్ రెడ్డి ఆమోదం పొందాక జరిగాక పరిణామాల బట్టి తన నిర్ణయం ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను బండి సంజయ్ చేసిన కామెంట్స్ తాను చూడలేదన్నారు. చూసిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి కేంద్ర మంత్రులను కలవడం తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా రాజీనామా ఇవ్వలేదని, స్పీకర్ ఆమోదించిన తర్వాత మాట్లడతానని చెప్పారు. కాగా బండి సంజయ్ తమతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించడంపై ఆయన ఈ రకంగా స్పందించారు.
Next Story