Mon Dec 23 2024 08:11:29 GMT+0000 (Coordinated Universal Time)
ఈసీకి బీజేపీ ఫిర్యాదు...ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ
ఎన్నికల కమిషన్ కు బీజేపీ మరో ఫిర్యాదు చేసింది. మునుగోడు ఎన్నికల వేళ తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది
ఎన్నికల కమిషన్ కు బీజేపీ మరో ఫిర్యాదు చేసింది. మునుగోడు ఎన్నికల వేళ తమ ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్ ఈ మేరకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అధికార టీఆర్ఎస్ ఓటర్లను ప్రభావితం చేస్తూ అరాచకాలకు పాల్పడుతుందని తెలిపారు. అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యదు చేశారు.
ఎలాంటి ఆర్థిక లావాదేవీలు...
అలాగే తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని, సుశీ ఇన్ఫ్రా నుంచి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగలేదని వారు తెలిపారు. ఈ మేరకు కోమటిరెడ్డి తరుపున ఎన్నికల కమిషన్ కు వివరణ అంద చేశారు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు సుశీ ఇన్ఫ్రా నుంచి జరగలేదని పేర్కొన్నారు.
Next Story