Mon Dec 23 2024 00:26:52 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత
ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని బీజేపీ ఆరోపించింది
ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కాంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని బీజేపీ ఆరోపించింది. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవిత హస్తం ఉందన్నారు. గోవా, పంజాబ్ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బు కూడా ఇచ్చారని బీజేపీ పార్లమెంటు సభ్యుడు పర్వేష్ వర్మ అన్నారు. కవిత ప్రత్యేక విమానంలో ఢిల్లీకి లిక్కర్ వ్యాపారులను తీసుకు వచ్చి ఆప్ ప్రభుత్వంతో ఈ డీల్ కుదిర్చారని ఆరోపించారు. మొత్తం 150 కోట్ల రూపాయల మేరకు డీల్ కుదిరిందని తెలిపారు.
డీల్ కుదిర్చింది...
కవితకు ఇందులో 4.5 కోట్లు ముట్టాయని బీజేపీ సీనియర్ నేత మంజీదర్ సింగ్ పర్సా ఆరోపించారు. మూడు కోట్ల రూపాయలు నగదుతో పాటు 1.5 కోట్ల విలువైన క్రెడిట్ నోట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. కవిత రెడ్డి బ్రదర్స్ ను ఢిల్లీకి తీసుకు వచ్చి డీల్ కుదుర్చారన్నారు. ఢిల్లీలోని ఒబ్రాయ్ హోటల్ లో ఆరు నెలల పాటు ఒక సూట్ బుక్ చేసుకున్నారన్నారు. ఆ సూట్ లో ఈ డీల్ కుదిరిందన్నారు. తెలంగాణ తరహాలోనే ఢిల్లీలో మద్యం పాలసీని తీసుకు వచ్చే ప్రయత్నం చేశారన్నారు. పంజాబ్ లో మద్యం ఫ్యాక్టరీని కూడా తెరిపించారని ఆయన ఆరోపించారు.
Next Story