Mon Dec 23 2024 05:24:26 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బోధన్ బంద్
నిజామాబాద్ జిల్లా బోధన్ బంద్ కు నేడు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో కొంత ఉద్రిక్తత తలెత్తే వాతావరణం నెలకొంది
నిజామాబాద్ జిల్లా బోధన్ బంద్ కు నేడు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో కొంత ఉద్రిక్తత తలెత్తే వాతావరణం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. బోధన్ పట్టణంలో 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బంద్ కు ఎటువంటి అనుమతి లేదని పోలీసు అధికారులు చెప్పారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగవద్దని, వస్తే తీవ్రమైన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.
ప్రత్యేక బలగాలు....
బోధన్ లో నిన్న శివాజీ విగ్రహాన్ని బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. దీనిపై ఒక వర్గం నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో పరస్పరం రాళ్ల దాడులకు దిగారు. పరిస్థిితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జిచ చేశారు. టియర్ గ్యాస్ ను కూడా వదిలారు. ప్రస్తుతం నేడు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బోధన్ లో ప్రత్యేక బలగాలు రంగంలోకి దించారు.
Next Story