Thu Dec 19 2024 06:20:35 GMT+0000 (Coordinated Universal Time)
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీంతోనే దర్యాప్తు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించాలంటూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ పిటీషన్ దాఖలు చేసింది.
సీబీఐ విచారణకు నో...
ఈ పిటీషన్ పై విచారించిన హైకోర్టు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. సిట్ ద్వారానే విచారణ చేయాలని ఆదేశించింది. దీంతో బీజేపీ కోరుకున్నట్లు ఈ కేసును సీీబీఐ చేత దర్యాప్తు చేసే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నేతృత్వంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు సాగనుంది.
Next Story