Mon Dec 23 2024 06:21:40 GMT+0000 (Coordinated Universal Time)
BJP : అభ్యర్థుల ఎంపిక ఇంకా ఆలస్యం.. రీజన్ ఇదే
బీజేపీ ఇంకా పదకొండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు విడతలుగా బీజేపీ జాబితాను ప్రకటించింది.
భారతీయ జనతా పార్టీ ఇంకా పదకొండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే నాలుగు విడతలుగా బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది. నాలుగు జాబితాలకు సంబంధించి వంద అభ్యర్థుల పేర్లను కన్ఫర్మ్ చేసింది. జనసేన పార్టీకి ఎనిమిది స్థానాలను కేటాయించింది. మిగిలిన పదకొండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
కొనసాగుతున్న కసరత్తు....
దీనిపై బీజేపీ నేతలు కసరత్తులు చేస్తున్నారు. పదకొండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరన్న దానిపై ఈరోజు రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ పెద్దలకు కూడా పదకొండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాలని, నామినేషన్ గడువు రేపటితో ముగుస్తుందని చెప్పడంతో, ఆశావహులందరూ నామినేషన్లు వేసుకోవాలని హైకమాండ్ సూచించనట్లు తెలిసింది. దీంతో అభ్యర్థుల ప్రకటన ఇంకా ఆలస్యమవుతుందని నేతలు భావిస్తున్నారు.
Next Story