Sun Dec 22 2024 20:38:03 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: టీఆర్ఎస్ లోకి దాసోజు శ్రావణ్
బీజేపీ నేత దాసోజు శ్రావణ్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈరోజు మంత్రి కేటీఆర్ సమక్షంలో శ్రావణ్ టీఆర్ఎస్ లో చేరనున్నారు
బీజేపీీ నేత దాసోజు శ్రావణ్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈరోజు సాయంత్రం మంత్రి కేటీఆర్ సమక్షంలో శ్రావణ్ టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాజనామా లేఖను దాసోజు శ్రావణ్ పంపారు. దాసోజు శ్రావణ్ బీజేపీలో చేరి నెలలు కూడా కాలేదు. ఆయన రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ లోనే ఉన్నారు. టీఆర్ఎస్ ను విభేదించి కాంగ్రెస్ లో చేరారు.
తిరిగి టీఆర్ఎస్ లోకి....
కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత ఇటీవల ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ నాయకత్వం వ్యవహారశైలి గిట్టక తాను బీజేపీలో చేరుతున్నట్లు దాసోజు శ్రావణ్ చెప్పారు. అయితే తాజాగా ఆయన బీజేపీీకి రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ లోకి చేరబోతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అనుసరిస్తున్న విధానం జగుప్సాకరంగా ఉందని ఆయన చెబుతున్నారు. కాంట్రాక్టర్లు డబ్బులతోనే రాజకీయం చేయాలని అనుకుంటున్నారని శ్రావణ్ అంటున్నారు.
Next Story