Mon Dec 23 2024 04:23:43 GMT+0000 (Coordinated Universal Time)
షర్మిలపై డీకే ఫైర్
వైఎస్ షర్మిల పార్టీపై బీజేపీ నేత డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలోని విభేదాల వల్లనే షర్మిల పార్టీ పెట్టారన్నారు
వైఎస్ షర్మిల పార్టీపై భారతీయ జనతా పార్టీ నేత డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబంలోని విభేదాల వల్లనే షర్మిల పార్టీ పెట్టారన్నారు. తెలంగాణలో పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో షర్మిల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చేశారన్ని విషయాన్ని గుర్తు చేశారు. ఏపీలో పోటీ చేయాలి కాని, తెలంగాణలో పార్టీ పెట్టడమెందుకని ఆమె నిలదీశారు.
ఏపీ లో పెట్టకుండా....
ఆంధ్రప్రదేశ్ పార్టీలను తెలంగాణ ప్రజలు ఆదరించరని డీకే అరుణ అన్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ ఎందుకు పెట్టారో ఆమెకే తెలియదన్నారు. కేవలం ఒక పార్టీకి లబ్ది చేకూర్చేందుకే షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని డీకే అరుణ ఆరోపించారు. షర్మిల పార్టీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదని డీకే అరుణ జోస్యం చెప్పారు. షర్మిల పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని, ఏపీకి వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని డీకే జోస్యం చెప్పారు.
Next Story