Mon Dec 23 2024 04:31:54 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రంలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై బీజేపీ నేత డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై బీజేపీ నేత డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియాగాంధీని తిట్టిన విషయాన్ని మర్చిపోయిన రేవంత్ ఇప్పడు దాని మరిచి మాట్లాడుతున్నారన్నారు. సోనియాను తెలంగాణ తల్లి కాదన్న రేవంత్ ఇప్పుడు తాను ఒక్కడే సోనియాకు దగ్గర అన్నట్లు మాట్లాడతున్నాడని డీకే అరుణ అన్నారు. రేవంత్ రెడ్డిది రెండు నాలుకల ధోరణిఅని అన్నారు. ఆరోజు కాంగ్రెస్ అవినీతి పార్టీ అని ఆరోజు అన్న రేవంత్ ఈరోజు ఈ పార్టీ అంత నీతిమంతమైన పార్టీ లేదంటున్నారన్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు.
రెండు నాల్కల ధోరణి...
ఈడీ, సీబీఐలతో భయపెట్టి బీజేపీ నేతలను చేర్చుకుంటుందన్నారు. కానీ ఆరోజు కాంగ్రెస్ చేసిందేమిటి అని ప్రశ్నించారు. గుజరాత్ నుంచి అమిత్ షాను బహిష్కరించింది కాంగ్రెస్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పెట్టిన ఈడీ, సీబీఐ కేసులు ఎన్ని రుజువయ్యాయని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్నది చంద్రబాబు కాంగ్రెస్ మాత్రమేనని, జాతీయ కాంగ్రెస్ కాదని డీకే అరుణ అన్నారు. ఎన్నికలకు పోకుండా ఉండేందుకు ఆరోజు రాజీనామా డ్రామా రేవంత్ రెడ్డి ఆడారని డీకే ఫైర్ అయ్యారు.
Next Story