Fri Dec 20 2024 04:32:22 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ మహిళ నేతల బైకు ర్యాలీ
తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలను బీజేపీ నేతలు ప్రారంభించారు.
తెలంగాణ విమోచన దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలను బీజేపీ నేతలు ప్రారంభించారు. ఈ నెల 17 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ మహిళ కార్యకర్తలు బైకు ర్యాలీతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ వరకూ మహిళల బైకు ర్యాలీని జరుపుతారు.
తెలంగాణ విమోచన దినోత్సవం...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించారు. తొలుత కిషన్ రెడ్డి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఎల్లుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది.
Next Story