Sat Nov 23 2024 02:59:53 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత?
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆయన ఇటీవల జైలు నుంచి విడుదలయిన నేపథ్యంలో బీజేపీ అగ్ర నేతలతో మాట్లాడినట్లు తెలిసింది. విధ్వేషాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్ పై ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు జైలులోనే ఉన్నారు. పీడీ యాక్ట్ కూడా నమోదు చేశారు. దీంతో బీజేపీ రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈరోజో.. రేపో....?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలంటూ కోరినట్లు చెబుతున్నారు. రాజాసింగ్ ఇప్పటికే తన సస్పెన్షన్ పై పార్టీ కేంద్ర నాయకత్వానికి వివరణ ఇచ్చారు. పార్టీ కోసం, హిందూ సమాజం కోసమే రాజాసింగ్ ఆ వ్యాఖ్యలు చేసి ఉంటారని బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్ పై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశముంది. పీడీ యాక్ట్ ను కూడా హైకోర్టు కొట్టివేయడంతో రాజాసింగ్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
Next Story