Mon Dec 23 2024 07:23:59 GMT+0000 (Coordinated Universal Time)
సభ నుంచి బయటకు పంపాలన్న కుట్ర
తనను సభకు హాజరు కాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
బీఏసీ లో అన్ని పార్టీలను ఆహ్వానించాలని ఈటల రాజేందర్ అన్నారు. అది సంప్రదాయంగా వస్తుందన్నారు. గతంలో సీపీఐ నుంచి ఒక్కరున్నా బీఏసీ సమావేశానికి ఆహ్వానించిందన్నారు. ఎన్ని రోజులు సమావేశం నిర్వహించాలి? ఏ అంశాలను చర్చించాలి? అన్న అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. బీఏసీ సమావేశంలోకి తమను రావడానికి వీలులేదన్నారు. తమ హక్కులను, గౌరవాలను కాపాడాల్సిన సభాపతి అలా వ్యవహరించడం బాధ అనిపించిందన్నారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు సభలోనే నిర్ణయాలు ప్రకటించాలి తప్ప బయట చేయడానికి వీలు లేదన్నారు. తాను స్పీకర్ ను కించపరుస్తూ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనను సభకు హాజరు కాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.
ప్రజాసమస్యలను ప్రస్తావించాలంటే...
కేసీఆర్ ఇనుప కంచెల మధ్యఉంటున్నారన్నారు. ఏ మంత్రికి స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ను కలిసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎవరికి చెప్పుకోవాలని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. తాను నాలుగురు ముఖ్యమంత్రులు, నలుగురు స్పీకర్ ల వద్ద పనిచేశానని, ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నారు. హుజూరాబాద్ లో తాను గెలిచిన తర్వాత కేసీఆర్ తనను చూసేందుకు ఇష్టపడటం లేదన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించలనుకున్నా తమను సభకు అనుమతించడం నివ్వలేదన్నారు. దళితబంధు మోసం పై ప్రశ్నించాలనుకున్నామని, దీన్ని అమలు చేయాలంటే ఇరవై ఏళ్ల సమయం పడుతుందని ఆయన అన్నారు. లక్ష రూపాయల రుణాన్ని రైతులకు ఏకకాలంలో మాఫీ చేస్తానని 2018 ఎన్నికల్లో చెప్పారని, దానిని ఇంతవరకూ అమలు చేయలేదని ఈటల రాజేందర్ ఆరోపించారు.
Next Story