Mon Dec 23 2024 00:39:32 GMT+0000 (Coordinated Universal Time)
రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ మహారాష్ట్ర రాజకీయాలు వస్తాయని ఆయన అన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ మహారాష్ట్ర రాజకీయాలు వస్తాయని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కు తాను చెబుతున్నానని, త్వరలోనే మహారాష్ట్ర రాజకీయాలను తెలంగాణలో చూడబోతున్నారని రాజాసింగ్ తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవుల విషయంలో అభద్రతతో ఉన్నారని, వారికి నాయకత్వంపై నమ్మకం లేకుండా పోయిందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
సొంత పార్టీలోనే...
సొంత పార్టీలోనే తిరుగుబాటు తప్పదని రాజాసింగ్ హెచ్చరించారు. కుటుంబ పాలన జరిగే ఎక్కడైనా ఇలాగే జరుగుతుందన్నారు. వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరిస్తారని రాజాసింగ్ అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల కోసమే వరద సాయం కోసం ఇక్కడి ప్రభుత్వం చూస్తుందన్నారు. మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారని రాజా సింగ్ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రభుత్వం సక్రమంగా చేయడం లేదని రాజాసింగ్ ఆరోపించారు.
Next Story