Tue Mar 25 2025 03:18:23 GMT+0000 (Coordinated Universal Time)
Raja Singh : రాజాసింగ్ బెదిరింపు కాల్స్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన ఫోన్ కాల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ చర్యలు లేవని రాజాసింగ్ తెలిపారు. తరచూ తనకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రాజాసింగ్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపినా పట్టించుకోలేదన్నారు.
రేవంత్ నెంబరు ఇచ్చానని...
తనకు ఫోన్ చేసిన వ్యక్తి ఎన్ని నెంబర్లున్నాయని అడిగితే రెండు నెంబర్లున్నాయని చెప్పానని రాజాసింగ్ తెలిపారు. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ నెంబరు ఇచ్చానని ఆయన తెలిపారు. తనకు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తులను పట్టుకుని వారిని చట్టప్రకారం శిక్షించాలని రాజాసింగ్ కోరుతున్నారు. అయితే తాను ఎవరి బెదిరింపులకు లొంగే ప్రసక్తి ఉండదని ఆయన చెప్పారు.
Next Story