Mon Mar 24 2025 16:54:38 GMT+0000 (Coordinated Universal Time)
Raja Singh : తిరుమలకు దేనికి? ప్రశ్నించిన రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తిరుమల పర్యటన ఎందుకని ప్రశ్నించారు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వైసీపీ అధినేత జగన్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ ఘటన మరవకముందే ఆయన ఎందుకు తిరుమలకు వస్తున్నట్లు అని రాజాసింగ్ ప్రశ్నించారు. ప్రసాదాన్ని అపవిత్రం పాలు చేయడంపై హిందు భక్తులంతా బాధపడుతున్నారన్న రాజాసింగ్, ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేయడానికే వెళుతున్నారా? అంటూ నిలదీశారు.
హిందువుల మనోభావాలను...
నమ్మకం లేనప్పుడు హిందూ దేవాలయాలకు వెళ్లడం దేనికని రాజాసింగ్ ప్రశ్నించారు. ఇది సరైన విధానం కాదని, హిందువుల మనోభావాలను మరింత రెచ్చగొట్టడమేనని రాజాసింగ్ అభిప్రాయపడ్డారు. ఈ నెల 28వ తేదీన వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనపడుతుంది. పర్యటన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముందని అన్నారు.
Next Story