Mon Dec 23 2024 00:40:09 GMT+0000 (Coordinated Universal Time)
అనుమతించని స్పీకర్... వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు
బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలోకి అనుమతించలేదు.
బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలోకి అనుమతించలేదు. సస్పెన్షన్ కు గురయిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ లు ఈరోజు అసెంబ్లీకి వచ్చారు. తొలుత అసెంబ్లీ కార్యదర్శిని కలిసి కోర్టు కాపీలను అందచేశారు. అనంతరం వారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిశారు.
అభ్యర్థనను తిరస్కరించారు...
అయితే సస్పెన్షన్ ను ఎత్తివేసేది లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. తమ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతించకపోవడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై స్పీకర్ దే తుదినిర్ణయమని హైకోర్టు నిన్న స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Next Story