Thu Dec 26 2024 09:28:47 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ సోయం అరెస్ట్
బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు
బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళుతున్న ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావును పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అక్కడకు వెళ్లకుండా అరెస్ట్ చేశారు. దీనిపై ఆయన అభ్యంతరం తెలిపారు. సమస్యలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలపడానికి వెళుతున్న తనను ఏవిధంగా అరెస్ట్ చేస్తారంటూ సోయం బాపూరావు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
ట్రిపుల్ ఐటీలో.....
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి మెస్ లోనే జాగారం చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలంటూ వారు ఆందోళనకు దిగారు. మరికొద్ది సేపట్లో వైస్ ఛాన్సిలర్ వెంకట రమణ విద్యార్థులతో చర్చలు జరపనున్నారు. మెస్ కాంట్రాక్టును ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం లేదని, టెండర్ల ప్రక్రియ ఉంటుందని ఆయన చెబుతుతున్నారు. మరి విద్యార్థులతో చర్చలు ఫలిస్తాయా? లేదా? అన్నది చూడాలి.
Next Story