Sun Dec 22 2024 22:58:33 GMT+0000 (Coordinated Universal Time)
Bandi Sanjay : నేడు బండి సంజయ్ రైతు దీక్ష
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నేడు రైతు దీక్ష చేపట్టనున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ నేడు రైతు దీక్ష చేపట్టనున్నారు. రైతులకు పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేస్తూ దీక్షకు దిగుతున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని, వెంటనే రైైతులకు పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, ఇందుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని కూడా బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట...
పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్లనే ఈ దుస్థితి తలెత్తిందని ఆయన అంటున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు దీక్ష చేయాలని నిర్ణయించారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఈ దీక్ష కొనసాగనుంది. క్వింటాల్ కు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు.
Next Story