Tue Mar 04 2025 15:14:08 GMT+0000 (Coordinated Universal Time)
నవంబరులోనే మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ నెలలో జరిగే అవకాశముంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు

మునుగోడు ఉప ఎన్నిక నవంబర్ నెలలో జరిగే అవకాశముంటుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ అన్నారు. ఈరోజు మునుగోడు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో బన్సల్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మండల స్థాయి ఇన్ ఛార్జులతో పాటు స్టీరింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.
ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకూ...
నవంబరు మొదటి లేదా రెండో వారంలో మునుగోడు ఉప ఎన్నిక ఉండే అవకావముందని బన్సల్ తెలిపారు. మండల స్థాయి ఇన్ ఛార్జులు మండల కేంద్రాల్లోనే ఉండాలని, ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ అక్కడి నుంచి రావద్దని సూచించారు. నియోజకవర్గంలోనే ఉండాలని కోరారు. ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుని వ్యవహరిస్తేనే గెలుపు సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్క ఓటరును కలవడం, ప్రతి ఓటును అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించాలని ఆయన ఆదేశించారు.
Next Story