Sun Apr 06 2025 05:39:19 GMT+0000 (Coordinated Universal Time)
జేపీ నడ్డాకు ఆంక్షలతో కూడిన అనుమతి
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బేగంపేట్ కు చేరుకున్నారు. జేపీ నడ్డాకు షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బేగంపేట్ కు చేరుకున్నారు. జేపీ నడ్డాకు షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించేందుకు పోలీసులు జేపీ నడ్డాకు సూచించారు. జేపీ నడ్డాకు స్వాగతం పలికేందుకు పెద్దయెత్తున బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న కార్యకర్తలను వెనక్కు పంపాలని బీజేపీ నేతలకు పోలీసుుల సూచించారు.
ర్యాలీకి....
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కోవిడ్ నిబంధనలున్న నోటీసును అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకూ ర్యాలీకి అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Next Story