Thu Dec 19 2024 18:24:36 GMT+0000 (Coordinated Universal Time)
అవన్నీ ఊహాగానాలే
బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులపై స్పందించారు
K.Lakshman:బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పార్లమెంటు ఎన్నికల్లో పొత్తులపై స్పందించారు. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని ఆయన తేల్చి చెప్పారు. కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికలలో ఎవరితోనూ బీజేపీ పొత్తులు పెట్టుకోదని అన్నారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యుడి హోదాలో చెబుతున్నానని అన్నారు.
అన్నీ స్థానాల్లోనూ...
తెలంగాణలోని అన్ని స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందన్న ఆయన ఎలాంటి పొత్తులు లేకుండానే ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతామని తెలిపారు. పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని అని అన్నారు.
Next Story