Fri Dec 20 2024 07:26:37 GMT+0000 (Coordinated Universal Time)
అసలు ఛీటర్ ఆయనే : లక్ష్మణ్
ప్రధాని రెండు సభలు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అన్నారు
ప్రధాని రెండు సభలు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ అన్నారు. వైఎస్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి తనకు సీఎం సీటు అప్పగిస్తే పార్టీని మూసేస్తానని కేసీఆర్ నాడు కాంగ్రెస్ నేతలో చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని గతంలో చెప్పిన మాట నిజం కాదా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. కేసీఆర్ తన అవసరానికి వాడుకునే నేత మాత్రమేనని, అసలు ఛీటర్ ఆయనేనని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
మార్పు కోరుకుంటూ...
పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై మండి పడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. కుటుంబ పార్టీలకు తెలంగాణలో కాలం చెల్లిందన్న లక్ష్మణ్ రోజురోజుకూ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న ఆయన ఈసారి మార్పు తధ్యమని తెలిపారు. కేసీఆర్ కుటుంబం అవినీతి ప్రజలకు తెలిసిపోయిందని, అందుకే ఈసారి గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని కూడా ఆయన తెలిపారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మరన్నారు.
Next Story