Sun Dec 22 2024 23:51:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫోన్ మిస్ అయింది.. వెతికి పెట్టరూ
తన ఫోన్ మిస్ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
తన ఫోన్ మిస్ అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ టూటౌన్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సంజయ్ ని అరెస్ట్ చేసిన క్రమంలో ఫోన్ మిస్ అయిందని చెబుతున్నారు.
తమ దగ్గర లేదని...
అయితే బండి సంజయ్ ఫోన్ లో కీలక సమాచారం ఉందని పోలీసులు చెబుతున్నారు. బొమ్మలరామారరం పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు బండి సంజయ్ దగ్గర ఫోన్ ఉంది. ఆ తర్వాత వాహనాలను మార్చి వరంగల్ కు తీసుకెళ్లడంతో ఫోన్ మిస్ అయిందని చెబుతున్నారు. అయితే తమ దగ్గర ఫోన్ లేదని పోలీసులు చెబుతున్నారు.
Next Story