Sun Jan 12 2025 23:35:33 GMT+0000 (Coordinated Universal Time)
బండికి హైకోర్టులో లభించని ఊరట
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హైకోర్టులో ఊరట లభించలేదు. ఆయన వేసిన బెయిల్ పిటీషన్ ను హైకోర్టు తిరస్కరించింది. జీవో నెంబరు 317 కి వ్యతిరేకంగా బండి సంజయ్ కరీంనగర్ లోని తన కార్యాలయంలో జాగరణ కు పిలుపునిచ్చారు. కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని ఆయనతో పాటు పోలీసులు పన్నెండు మందిపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ కోర్టు బండి సంజయ్ కు 14 రోజులు రిమాండ్ విధించింది.
రేపు సుప్రీంకోర్టులో....
దీంతో బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని, తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని కోరారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించి కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని తెలిపారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులు విచారణ జరిపే కోర్టుకు వెళ్లాలని సూచించారు. దీంతో బండి సంజయ్ రేపు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు.
Next Story