Mon Dec 23 2024 08:03:18 GMT+0000 (Coordinated Universal Time)
సింగిల్గానే పోటీ చేస్తాం
పొత్తులపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.
పొత్తులపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. తాము సింగిల్ గానే పోటీ చేస్తామని తెలిపారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని చెప్పిన బండి ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తామని ఆయన తెలిపారు. ఏ పార్టీతోనూ తమ పార్టీ పొత్తు పెట్టుకోదని కూడా చెప్పారు. సింగిల్ గానే పోటీ చేసి అధికారంలోకి వచ్చి రజాకార్ల రాజ్యాన్ని కూలదోస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ వస్తే రాలేం...
కాంగ్రెస్ వస్తే తాము రాలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగ సమస్యపై ఉమ్మడి పోరాటం చేయాలన్న వైఎస్ షర్మిలకు బండి సంజయ్ను కోరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా రెస్పాండ్ అయ్యారు. తాము కేవలం వైఎస్సార్టీపీతో మాత్రమే కలసి పోరాటానికి వస్తామని, కాంగ్రెస్తో కలసి మాత్రం ఏ కార్యక్రమంలో పాల్గొనబోమని ఆయన వైఎస్ షర్మిలకు స్పష్టం చేశారు.
Next Story