Mon Dec 23 2024 01:53:26 GMT+0000 (Coordinated Universal Time)
ఇంత బానిస బతుకా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. అమిత్ షాకు నిన్న చెప్పులు అందివ్వడంపై అన్ని రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని గుజరాతీయుల వద్ద తాకట్టు పెట్టారని కామెంట్స్ వినపడుతున్నాయి. బీజేపీ నాయకులు ఇంత బానిస బతుకు బతుకుతున్నారా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
సోషల్ మీడియాలో....
అమిత్ షా బూట్లు మోసి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలను దిగజార్చారని టీఆర్ఎస్ నేతలు నెట్టింట వ్యాఖ్యానించారు. తెలంగాణను అమిత్ షా కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారంటూ పోస్టులు చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా దీనిపై రియాక్ట్ అయింది. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని అమిత్ షా కాళ్ల వద్ద తాకట్టు పెట్టారంటూ కామెంట్ పెట్టారు. అమిత్ షా చెప్పులు మోయడమేంటి? అని ఆయన ప్రశ్నించారు.
Next Story