Mon Dec 23 2024 08:20:59 GMT+0000 (Coordinated Universal Time)
విధ్వంసానికి కారణం టీఆర్ఎస్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యమేనన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలని ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తుందని అన్నారు. నిన్న కాంగ్రెస్ జరిపిన ర్యాలీ కూడా హింసాత్మకంగా మారడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరే కారణమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
ఇంటలిజెన్స్ ఏం చేస్తుంది?
వేలాది మంది అభ్యర్థులు సికింద్రాబాద్ స్టేషన్ ను ముట్టడిస్తుంటే ఇంటలిజెన్స్ ఏం చేస్తుందని బండి సంజయ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలసి కుట్ర పన్నాయన్నారు. అగ్నిపథ్ వల్ల అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగదని ఆయన చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మోదీ ప్రభుత్వం ఎవరికీ అన్యాయం చేయదని బండి సంజయ్ అన్నారు. కాగా బండి సంజయ్ ను బాసర వెళుతుండగా కరీంనగర్ జిల్లా బికనూర్ టోల్‌ప్లాజా వద్ద అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
Next Story