Thu Dec 26 2024 05:14:53 GMT+0000 (Coordinated Universal Time)
డ్రగ్స్ కేసీఆర్ కొంపముంచడం గ్యారంటీ
డ్రగ్స్ వల్లనే పంజాబ్ లో అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు
డ్రగ్స్ వల్లనే పంజాబ్ లో అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని ఆరోపించారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఏమయిందని బండి సంజయ్ ప్రశ్నించారు. కెల్విన్ చెప్పిన వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదని బండి సంజయ్ నిలదీశారు. డ్రగ్స్ విషయాలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
సహకరించకుండా.....
కావాలనే ప్రభుత్వం డ్రగ్స్ కేసుల్లో అధికారులకు సహకరించడం లేదన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీకి ఎందుకు సహకరించడ ంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కొన్ని రోజులు హడావిడి చేయడం, తర్వాత మామూలవ్వడం సర్వ సాధారణంగా మారిందని, డ్రగ్స్ ను నియంత్రించాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. పంజాబ్ మాదిరిగానే ఇక్కడి ప్రభుత్వం కూడా డ్రగ్స్ కారణంగానే ఓటమి పాలు కాక తప్పదని బండి సంజయ్ హెచ్చరించారు.
Next Story