Thu Dec 19 2024 06:25:39 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ సమాజానికి ఏం సంబంధం?
తెలంగాణ సమాజం పరువును కేసీఆర్ కుమార్తె కవిత దేశ వ్యాప్తంగా దిగజార్చారాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు
తెలంగాణ సమాజం పరువును కేసీఆర్ కుమార్తె కవిత దేశ వ్యాప్తంగా దిగజార్చారాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. పార్టీకి, దర్యాప్తు సంస్థలతో సంబంధం లేదన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. తాము తప్పు చేసి తెలంగాణ సమాజం మీద దాడిగా చెప్పడమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇంతవరకూ కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. దొంగతనం చేసి తెలంగాణ సమాజం అంటే ఏంటని ఆయన ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ విచారణకు కవిత సహకరించాల్సిందేనని అన్నారు.
మరోసారి మోసం...
కేసీఆర్ కుటుంబం చేతిలో మరోసారి తెలంగాణ సమాజం బలి కాబోదని తెలిపారు. కవిత చేసిన పని వల్ల తెలంగాణ మహిళలు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ లో మహిళ అధ్యక్షురాలు ఎవరైనా ఉన్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. తొలి మంత్రివర్గంలో మహిళలకు కేసీఆర్ స్థానం కల్పించారా? అని నిలదీశారు. మహిళ దినోత్సవం జరుపుకునే హక్కు బీఆర్ఎస్ కు లేదన్నారు. లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితకు, కేసీఆర్ కుటుంబానికి సానుభూతి లభించే అవకాశమే లేదని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం చరిత్ర అందరికీ తెలుసునని బండి సంజయ్ అన్నారు
Next Story