Sun Dec 22 2024 16:36:19 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ఆస్తుల చిట్టా తీస్తున్నాం
ప్రజాసంగ్రామ పాదయాత్రను పదే పదే అడ్డుకునేందుకు ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రజాసంగ్రామ పాదయాత్రను పదే పదే అడ్డుకునేందుకు ప్రయత్నించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. కార్యకర్తలను, నేతలను అక్రమ అరెస్టులతో ఇబ్బందులు పెట్టారన్నారు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో నీ కుటుంబం పాత్ర ఉందా? లేదా? అని చెప్పాలని కోరారు. కేసీఆర్ ఆస్తుల చిట్టాను బయటకు తీస్తున్నామని చెప్పారు. ఎవడో కామెడీ షోలో సీతమ్మను అవమానపరుస్తుంటే వారిని హైదరాబాద్ లో ఆహ్వానం పలుకుతున్నారన్నారు. లిక్కర్ స్కామ్ ను పక్కన పెట్టేందుకే మునావర్ ను తెలంగాణకు రప్పించారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మునావర్ ఫారూఖీకి రెండు వేల మంది సభతో భద్రత ఇస్తావు కాని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమను అడగుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు.
యుద్ధం మొదలయింది..
కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణలో పాలన చూస్తుంటే రక్తం సలసల కాగుతుందన్నారు. హైదరాబాద్ లో మత ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. యుద్ధానికి సిద్ధమని బండి సంజయ్ ప్రకటించారు. కోర్టు అనుమతులు తీసుకుని సభలు, పాదయాత్రలు చేసుకోవాల్సి వస్తుందన్నారు. తెలంగాణకు ఏమైందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అంటేనే కేసీఆర్ గజగజ వణుకుతున్నాడని సంజయ్ అన్నారు. ఎంఐఎం పార్టీని చంకనెత్తుకుని వస్తున్నావని, ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. పోలీసు వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం కాదని, అదరికీ న్యాయం అందించాలని ఆయన కోరారు. కొందరు అధికారుల వల్ల పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని బండి సంజయ్ అన్నారు.
Next Story