Mon Dec 23 2024 13:40:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కర్ణాటకకు బండి... సిట్ విచారణకు?
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన నేడు కర్ణాటక పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. బీదర్ లో ఆయన ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
లీగల్ టీం...
దీంతో బండి సంజయ్కు బదులు బీజేపీ లీగల్ టీం సిట్ ఎదుట విచారణకు హాజరు కానుంది. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తొలుత ఈ నెల 24వ తేదీన విచారణకు రావాల్సిందిగా కోరగా ఆయన పార్లమెంటు సమావేశాలు ఉండటం, పార్టీ విప్ జారీ చేయడంతో విచారణకు హాజరు కాలేకపోయారు. దీంతో మరొకసారి సిట్ నోటీసులు జారీ చేసింది. అయినా తాను సిట్ కు తన వద్ద ఉన్న ఆధారాలను అందచేయనని, తనకు నమ్మకమైన సంస్థలకు మాత్రమే ఆధారాలు ఇస్తానని బండి సంజయ్ తెలిపారు.
- Tags
- bandi sanjay
- sit
Next Story