Thu Dec 26 2024 07:59:53 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ కు మద్దతుగా నేడు జేపీ నడ్డా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించనున్నారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోనే అక్రమంగా అరెస్ట్ చేసిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో బీజేపీ క్యాండిల్ ర్యాలీని నిర్వహిస్తుంది. ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారు.
కిషన్ రెడ్డి....
మరోవైపు బండి సంజయ్ ను నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జైలులో కలవనున్నారు. ఆయనను అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకోనున్నారు. బండి సంజయ్ కుటుంబాన్ని కూడా కిషన్ రెడ్డి పరామర్శిస్తారు. అరెస్ట్ అయిన ఎంపీ కార్యాలయాన్ని కూడా ఆయన సందర్శిస్తారు.
Next Story