Tue Dec 24 2024 00:17:56 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కొల్లాపూర్ కు బండి సంజయ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కొల్లాపూర్ లో పర్యటించనున్నారు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేడు కొల్లాపూర్ లో పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు, కొల్లాపూర్ ఇన్ఛార్జి ఎల్లేని సుధాకర్ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఆయన పాదయాత్ర ముగింపు సభకు బండి సంజయ్ హాజరుకానున్నారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి సంజయ్ ప్రసంగిస్తారు.
పాదయాత్ర ముగింపు సభకు...
గత నెల 8వ తేదీ నుంచి ఎల్లేని సుధాకర్ రావు కొల్లాపూర్ లో పాదయాత్ర చేస్తున్నారు. కొల్లాపూర్ సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల ను కలుసుకోవడానికి ఆయన పాదయాత్ర చేపట్టారు. దాదాపు నెల రోజుల పైనుంచి ఆయన పాదయాత్ర నియోజకవర్గంలో కొనసాగింది. గ్రామ గ్రామాన పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఆ సమస్యలను బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచనున్నారు. బండి సంజయ్ సభలో పాల్గొననుండటంతో భారీ జనసమీకరణకు నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story