Thu Mar 27 2025 12:16:43 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ముగియనున్న బండి పాదయాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర నేటితో ముగియనుంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర నేటితో ముగియనుంది. ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రను బండి సంజయ్ గత నెల 28న నిర్మల్ భైంసాలో ప్రారంభించారు. ఐదో విడత పాదయాత్ర దాదాపు 222 కిలోమీటర్ల మేరకు సాగింది. దారి పొడవునా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ బండి సంజయ్ తన పాదయాత్రను కొనసాగించారు.
222 కిలోమీటర్లు...
ముథోల్, నిర్మల్, ఖానాపూర్, కోరుట్ల, వేములవాడ, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర సాగింది. ఈరోజు కరీంనగర్ లో పాదయాత్రను సంజయ్ ముగించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. బహిరంగ సభను భారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని ప్రాంతాల నుంచి బహిరంగ సభకు ప్రజలను తరలించేందుకు బీజేపీ నేతలు కృషి చేస్తున్నారు.
Next Story