Thu Dec 19 2024 18:00:26 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ పాదయాత్ర వాయిదా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా పడింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 15 నుంచి ఐదో విడత పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు రోడ్ మ్యాప్ ను కూడా పార్టీ ప్రకటించింది. అయితే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదల కావడంతో ఆయన పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాతనే ఐదో విడత పాదయాత్ర ప్రారంభం కానుంది.
నాలుగు విడతలుగా...
ఇప్పటికే బండి సంజయ్ నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేశారు. నాలుగు విడత యాత్రల్లోనూ మంచి స్పందన కనిపించింది. ముగింపు సభలకు కేంద్ర మంత్రులు వచ్చి మంచి జోష్ నింపారు. పాదయాత్రతో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న బండి సంజయ్ ఈ నెల 15వ తేదీ నుంచి ఐదో విడత చేయాలనుకున్నారు. కానీ మునుగోడు ఉప ఎన్నిక కారణంగా వాయిదా వేసుకున్నారు. యాత్ర తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేది త్వరలోనే తెలియజేస్తామని బీజేపీ నేతలు చెప్పారు.
Next Story