Mon Dec 23 2024 10:36:01 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ, బీఆర్ఎస్పై బండి ఫైర్
వైసీీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న మ్మాబొరుసులాంటివని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మాబొరుసులాంటివని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ రెండు పార్టీలు సెంటిమెంట్ రగిలిస్తున్నాయన్నారు. ఒకరి స్వార్థం కోసం మరొకరు వ్యవహరిస్తున్నారన్నారు.
రాజకీయ స్వార్థం కోసమే...
తమ రాజకీయ స్వార్థం కోసం విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారని బండి సంజయ్ విమర్శించారు. విశాఖ ఉక్కు కొనే డబ్బుంటే రాష్ట్రంలో బయ్యారం ఫ్యాక్టరీ, నిజాం షుగర్స్ తెరవొచ్చు కదా అని తెలంగాణ ప్రభుత్వాన్ని సంజయ్ ప్రశ్నించారు. అలా కాకుండా కేసీఆర్ నాటకాలకు తెరతీశారంటూ బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు.
Next Story