Fri Dec 20 2024 22:34:11 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్
బీజేపీకి తెలంగాణలో భారీ షాక్ తగలనుంది. కాంగ్రెస్ పార్టీలో గడ్డం వివేక్ చేరనున్నారు
కాంగ్రెస్ గూటికి గడ్డం వివేక్ చేరబోతున్నారు. ఆయన మరికాసేపట్లో రాహుల్ గాంధీని కలవనున్నారు. నోవాటెల్ లో బసచేసిన రాహుల్ గాంధీతో వివేక్ సమావేశమై పార్టీలో చేరనున్నారు. ఆయనతో పాటు కుమారుడు వంశీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఫోన్ లో మాట్లాడిన వివేక్ వెంకటస్వామి ఈరోజు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. భారతీయ జనతా పార్టీకి ఆయన తన రాజీనామా లేఖను పంపారు.
తిరిగి కాంగ్రెస్ లోకే...
వివేక్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన తండ్రి వెంకటస్వామి జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయన సోదరుడు వినోద్ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నారు. అయితే వివేక్ మధ్యలో టీఆర్ఎస్ కు వెళ్లారు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. అయితే తాజాగా మరోసారి వివేక్ కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు. ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. అసెంబ్లీ బరిలో వివేక్ ను నిలపాలని కాంగ్రెస్ భావిస్తుంది.
Next Story