Mon Dec 23 2024 05:55:12 GMT+0000 (Coordinated Universal Time)
BJP : ఇందిరా పార్క్ వద్ద నేడు బీజేపీ ధర్నా
బీజేపీ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతుంది.
భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతుంది. మూసీ నది ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈ ధర్నాను చేపడుతుంది. మూసీ నది సుందరీకరణ పేరుతో అమాయక, పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తున్నారన్న కారణంతో ఇప్పటికే బీజేపీ ఆందోళనలు ప్రారంభించింది.
మూసీ నది ప్రాజెక్టు...
అందులో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు దిగుతుంది. ఈ ధర్నాకు పార్టీ అగ్రనేతలందరూ హాజరవుతున్నాయి. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకంగ కాదని, అదే సమయంలో పేద ప్రజల ఇళ్లను కూల్చివేస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది.
Next Story