Sun Dec 22 2024 23:03:09 GMT+0000 (Coordinated Universal Time)
BJP : ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేడు ధర్నా
ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు బీజేపీ ధర్నాకు దిగుతుంది
నేడు భారతీయ జనతా పార్టీ ఇందిరాపార్క్ దగ్గర ఆందోళనకు దిగుతుంది.ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు ధర్నాకు దిగుతుంది. ఇన్నాళ్లయినా ఫోన్ ట్యాపింగ్ నిందితులలో ముఖ్యమైన వారిని అదుపులోకి తీసుకోలేదని బీజేపీ ఆరోపిస్తుంది. ముఖ్యులను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
కేసీఆర్ ఆదేశాలతోనే...
కేసీఆర్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బీజేపీ గత కొద్ది రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని, కేవలం అధికారులను మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని బీజేపీ ఆరోపిస్తుంది. ఫోన్‌ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాకు దిగుతుంది.
Next Story