Tue Dec 24 2024 05:02:09 GMT+0000 (Coordinated Universal Time)
ఆడియో లీకులో బీఎల్ సంతోష్ పేరు
మొయినాబాద్ ఫాంహౌస్ లో బయటపడిన ఆడియోలో బీఎల్ సంతోష్ పేరు వినిపించింది.
మొయినాబాద్ ఫాంహౌస్ లో బయటపడిన ఆడియోలో బీఎల్ సంతోష్ పేరు వినిపించింది. బీఎల్ సంతోష్ భారతీయ జనతా పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. ఆయన పేరు ఇప్పుడు బయటకు రావడం కలకలం రేపుతుంది. తెలంగాణకు కూడా ఆ మధ్య బీఎల్ సంతోష్ వచ్చి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఉంటే కుదరదని క్షేత్రస్థాయిలో పర్యటించాలని కూడా బీఎల్ సంతోష్ తెలంగాణ నేతలకు వెల్లడించారు.
సంతోష్ తో కలసి....
ప్రభుత్వ ఏర్పాట్లన్నీ సంతోష్ మాత్రమే చూసుకుంటున్నారని రామచంద్ర భారతి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో తెలిపారు. నెంబర్ 1, నెంబర్ 2 నేరుగా బీఎల్ సంతోష్ ఇంటికి వస్తారని తెలిపారు. సంతోష్ తో కలిసి నెంబర్ 2 వద్దకు వెళదామన్నారు. ఆయన బీజేపీలో ముఖ్యమైన వ్యక్తి అని కూడా అననారు. ఏ నిర్ణయమైనా సంతోష్ తీసుకుంటారని తెలిపారు. సంతోష్ మాత్రం నేరుగా ఇక్కడకు రారని కూడా రామచంద్ర భారతి తెలిపారు.
Next Story