Sun Dec 14 2025 18:11:00 GMT+0000 (Coordinated Universal Time)
రాకేష్ మృతదేహంతో నిరసన ర్యాలీ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మృతి చెందిన రాకేష్ మృతదేహానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మృతి చెందిన రాకేష్ మృతదేహానికి నేడు అంత్యక్రియలు జరగనున్నాయి. నిన్న మృతి చెందిన రాకేష్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఉంచారు. ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాకేష్ మృతదేహంతో నిరసన ర్యాలీని నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాకేష్ మృతి చెందారని ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
నేడు నరసన్న పేట బంద్...
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఈరోజు నరసన్నపేట బంద్ కు పిలుపునిచ్చింది. రాకేష్ మృతదేహంతో ర్యాలీ నిర్వహించాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఆర్మీ అభ్యర్థులు కూడా రాకేష్ అంత్యక్రియలకు పెద్దయెత్తున హాజరయ్యే అవకాశముండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

