Fri Dec 20 2024 12:21:49 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ-సికింద్రాబాద్ రైళ్లలో బాంబు.. అధికారుల తనిఖీలు
అలాగే చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్ ప్రెస్ ను ఆపివేసి.. అందులోనూ తనిఖీలు చేస్తున్నారు. రైలు బోగీల్లో అనుమానాస్పదంగా..
విశాఖపట్నం : అజ్ఞాత వ్యక్తి 100కి ఫోన్ చేసి ఇచ్చిన సమాచారంతో అధికారులు రెండు రైళ్లను ఆపి తనిఖీలు చేపట్టారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వచ్చే రైళ్లలో బాంబులు ఉన్నట్లు ఆ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. అతడి ఫోన్ కాల్ తో రైల్వే రక్షకదళం పోలీసులు కాజీపేటలో ఎల్ టీటీ ఎక్స్ ప్రెస్ ను నిలిపి తనిఖీలు చేపట్టారు.
అలాగే చర్లపల్లి వద్ద కోణార్క్ ఎక్స్ ప్రెస్ ను ఆపివేసి.. అందులోనూ తనిఖీలు చేస్తున్నారు. రైలు బోగీల్లో అనుమానాస్పదంగా కనిపించిన వస్తువులు, మనుషులను తనిఖీలు చేస్తున్నారు. కాగా.. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ? కేవలం బెదిరించడానికే అజ్ఞాత వ్యక్తి కాల్ చేశాడా ? అన్న విషయంపై ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story