Mon Dec 23 2024 08:33:35 GMT+0000 (Coordinated Universal Time)
మానేరు వాగుపై కూలిన వంతెన
మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది. నాసిరకం పనులకు ఇది నిదర్శనమంటూ స్థానికులు ఆందోళనకు దిగారు
మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన కూలిపోయింది. నిర్మాణంలో ఉన్న ఈ బ్రిడ్జి కూలడం స్థానికులను కూడా ఆశ్చర్యపోయేలా చేసింది. నాసిరకం పనులకు ఇది నిదర్శనమంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ముత్తారం మండం ఓడేడు పరిధిలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు.
అర్ధరాత్రి సమయంలో...
ఓడేడు నుంచి గర్మిళ్లపల్లి మధ్య దూరాన్ని తగ్గించాలన్న ఉద్దేశ్యంతో వాగుపై నిర్మిస్తున్న ఈ వంతెన ను నిర్మిస్తున్నారు. 2016లో ప్రారంభమయిన ఈ పనులు సుదీర్ఘంగా సాగుతున్నాయి అర్థరాత్రి వంతెన కూలిపోవడంతో ప్రమాదం తప్పిందని, అదే మామూలు సమయాల్లో జరిగి ఉంటే అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారని స్థానికులు చెబుతున్నారు. నాసిరకం నిర్మాణంతోనే వంతెన కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
Next Story