Mon Dec 15 2025 04:07:35 GMT+0000 (Coordinated Universal Time)
కోమటిరెడ్డిపై కుర్చీలతో దాడి
భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు

భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆయనపై కుర్చీలు,కర్రలు విసిరారు. అయితే పార్టీ కార్యకర్తలు, గన్మెన్లు వాటిని అడ్డుకోవడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ప్రమాదం తప్పింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటుకలపాడుకు ఈరోజు వెళ్లారు.
రహదారి బాగాలేదంటూ..
అయితే ఇటుకులపాడుకు వెళ్లే రహదారి బాగాలేదని, తాను రావడానికి మూడు గంటల సమయం పట్టిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. కుర్చీలు, కర్రలను ఆయనపైకి విసిరారు. అయితే కోమటిరెడ్డి అనుచరులు, గన్మెన్లు వాటిని ఆయన మీద పడకుండా కాపాడారు. ఈ ఘటనతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను సర్ది చెప్పి పంపారు.
Next Story

